పిల్లాయిపల్లి కాలువకు మరమ్మతులు చేయించి సాగునీరు అందిస్తాం
సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్
రైతుల సంక్షేమం, వారి ఆర్థిక పురోగతే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తామని చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లోని వలిగొండ రోడ్డు రైతు వేదిక వద్ద 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, వైస్ చైర్మన్ పర్నే శివారెడ్డి, డైరెక్టర్ సురుకంటి లక్ష్మమ్మ యాదిరెడ్డిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్ మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రైతు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. మండలంలోని గ్రామాలకు పిల్లాయిపల్లి కాలువ ద్వారా సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని, కాలువ మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టి, భూగర్భ జలాలు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, నాయకులు బండమీది మల్లేష్, ఊదరి నరసింహ, దోనకొండ కృష్ణ, నల్ల గణేష్ యాదవ్, ఉడత నరసింహ, బోరెం శేఖర్ రెడ్డి, మారుపాకల స్వామి, మట్టపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి