నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఏఐకేఎస్ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
బుధవారం కోదాడ పట్టణంలో మహాసభల ప్రచారంలో భాగంగా జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల గడ్డపై తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిసాన్ సభ అఖిలభారత మహాసభలు నిర్వహించడం గర్వకారణమన్నారు. నవంబర్ 15న లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, కార్మికులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం. ముత్యాలు, రామారావు, నాగేశ్వరరావు, రాముడు, వీరయ్య, అంజి, శ్రీనివాస్, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి