కోనేరు చెంతే డ్రైనేజీ ప్రవాహం.. భక్తుల ఆగ్రహం.
చెరువుగట్టు: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో డ్రైనేజీ నీరు పారుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవిత్రమైన కోనేరు సమీపంలోనే మురుగునీరు ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు, దేవస్థాన పాలకవర్గం పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. పుణ్యక్షేత్రం పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఇంత అధ్వానంగా మారినా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి