Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ! నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 06:08 PM

పూజారిపై దాడి.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత.

02-10-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ, హిందూ సంస్థల ధర్నా.. నిందితుడు పోలీసుల అదుపులో

దిల్‌సుఖ్‌నగర్‌: సంతోషిమాత ఆలయంలో పూజారిపై దాడి ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. అమ్మవారి విగ్రహం సమీపంలో విధులు నిర్వహిస్తున్న పూజారిపై కర్రతో దాడి చేసినట్లు సమాచారం. దీంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

బస్టాండ్‌ వద్ద బైఠాయింపు.

ఘటన విషయం తెలుసుకున్న హిందూ సంస్థల ప్రతినిధులు, బీజేపీ నాయకులు దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. సుమారు 30–40 మంది ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

పోలీసుల రంగప్రవేశం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైతన్యపురి, మలక్‌పేట్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిరసనకారులను రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పూజారిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sthanikam

పూజారిపై దాడి.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News