Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 09:26 PM

పోషకాహారంతోనే ఆరోగ్యం. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత.

29-09-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత సూచించారు. మంగళవారం బోగారం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణీలు సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంతోపాటు గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఏ.సుధా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, అంగన్‌వాడీ టీచర్‌ బత్తుల వసంత, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత, అంగన్‌వాడీ ఆయాలు రత్నం, ఎల్లమ్మ, పంజాల ధనమ్మతోపాటు గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

Sthanikam

పోషకాహారంతోనే ఆరోగ్యం. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News