Sthanikam - Truth Matters
Logo

పోలీసు విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు : ఐజీ షాహనాజ్ ఖాసీం

Updated : 28 Nov 2026 18:37 IST
As Preferred Source 1 min read
పోలీసు విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు : ఐజీ షాహనాజ్ ఖాసీం

పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం సూచించారు. శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె డాగ్ స్క్వాడ్, ఎంటీ, డీపీఓ తదితర విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నిరంతర పెట్రోలింగ్, నాకాబందీ నిర్వహిస్తూ నేరాలు, దొంగతనాలను అరికట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసు విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు : ఐజీ షాహనాజ్ ఖాసీం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news