Sthanikam - Truth Matters
Logo

వట్టిమర్తిలో నేడు ఉచిత వైద్య శిబిరం

Updated : 28 Nov 2026 17:54 IST
As Preferred Source 1 min read
వట్టిమర్తిలో నేడు ఉచిత వైద్య శిబిరం

కీశే మేడి లింగయ్య స్మారకార్థం రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

చిట్యాల, నవంబర్ 28: రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీశే మేడి లింగయ్య నెలమాసికం సందర్భంగా ఆదివారం (నవంబర్ 29) వట్టిమర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, చర్మవ్యాధులు, దంత వైద్యం తదితర విభాగాల్లో సేవలందించనున్నారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు, గుండె సంబంధిత ప్రత్యేక పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్, విశిష్ట అతిథిగా హైకోర్టు ప్రముఖ న్యాయవాది గొల్ల జయప్రకాష్ బాబు హాజరుకానున్నారు. గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.

Sthanikam

వట్టిమర్తిలో నేడు ఉచిత వైద్య శిబిరం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news