నారాయణఖేడ్ మండలం చాప్టా కె గ్రామానికి చెందిన శేరికర్ నందు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ బోర్డు సభ్యుడిగా నియమితులైన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన నందుకు రైల్వే బోర్డు సభ్యుడిగా అవకాశం రావడం సంతోషకరమని, ఈ బాధ్యత ద్వారా రైల్వే ప్రయాణికుల సమస్యలు, ప్రజల అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. శేరికర్ నందు గత కొంతకాలంగా నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కొత్తగా లభించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ ఈ సందర్భంగా నందుకు అభినందనలు తెలిపారు.
శేరికర్ నందుకు అరుదైన అవకాశం.. ఘనంగా అభినందించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి