కోదాడ పట్టణంలోని 24వ వార్డు బంగారు షాప్ బజార్‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మున్సిపాలిటీ పక్క వీధిలో ఉన్న బ్రమరాంబ జ్యువెలరీస్ వర్క్‌షాప్ పైకప్పు భాగాన్ని కత్తిరించి లోపలికి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. షాప్ యజమాని బొద్దోజు మల్లికార్జున చారి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఐదు కిలోల వెండి, మూడు తులాలకు పైగా బంగారం, రూ.27 వేల నగదును దుండగులు అపహరించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు.
సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై మల్సూర్, హెడ్ కానిస్టేబుల్ మండవ హుస్సేన్ గౌడ్, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి