సంగారెడ్డి జిల్లాలో
సదాశివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఏ.రాజేష్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ (ఔట్‌సోర్సింగ్) ఏ. శివారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 27) మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో వారి కార్యాలయంలోనే ఇరువురు పట్టుబడ్డారు.
ఉబా చెరువు వద్ద 2025 గణేశ్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా చేపట్టిన పూడికతీత పనులకు సంబంధించి రూ.4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లును ఇప్పటికే మంజూరు చేసి ప్రాసెస్ చేసినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించారు.
అనంతరం ఆ మొత్తాన్ని వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు భద్రత కోసం అప్పగించారు. ఏసీబీ అధికారులు వర్క్ ఇన్‌స్పెక్టర్ వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరూ తమ అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి