Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్‌కు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అభినందనలు

Updated : 27 Nov 2026 20:03 IST
As Preferred Source 1 min read
కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్‌కు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అభినందనలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన బి.ఎం. సందీప్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ గిరిజా షేట్కార్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ బి.ఎం. సందీప్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నూతన ఇన్‌చార్జ్‌కు తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్‌కు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అభినందనలు

Article Image

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన బి.ఎం. సందీప్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ గిరిజా షేట్కార్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ బి.ఎం. సందీప్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నూతన ఇన్‌చార్జ్‌కు తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి