Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్ గౌడ్

Updated : 27 Nov 2026 20:40 IST
As Preferred Source 1 min read
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్ గౌడ్

1వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పారిశుద్ధ్యం ఎంతో కీలకమని చౌటుప్పల్‌ పురపాలక ఛైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. పురపాలికలోని 20 వార్డులను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. కమిషనర్‌ వెంకటేశ్వరనాయక్‌, 1వ వార్డు కౌన్సిలర్‌ కొసనం రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డులోని వివిధ కాలనీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. శుభం ఫంక్షన్‌ హాల్‌ వరకు ఉన్న ఇరుకైన రహదారిపై పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను జేసీబీ, డోజర్లతో తొలగించి రహదారిని వెడల్పు చేశారు. మురుగుకాలువలు, కల్వర్టులను శుభ్రం చేయించారు.అనంతరం 1వ వార్డు లింగారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో బోదుల లింగమ్మ-రాములు, 16వ వార్డులో షేక్‌ షహీన్‌-రహీంలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఛైర్‌పర్సన్‌ పావని రమేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు హన్ను మహమ్మద్‌, దేప రమ్యరాజు, నాయకులు పోలోజు శ్రీనివాసాచారి, బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, కందాల వెంకటరెడ్డి, సురుకంటి వెంకటరెడ్డి, గణేశ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ హనుమాన్‌ప్రసాద్‌, పర్యావరణ ఇంజినీర్‌ రేణుకుమార్‌, హౌసింగ్‌ ఏఈ కళ్యాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి