Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, కుక్కల దాడుల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష

Updated : 28 Nov 2026 17:55 IST
As Preferred Source 1 min read
రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, కుక్కల దాడుల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి IAS , జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS అధ్యక్షతన రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, వీధి కుక్కల దాడుల నివారణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రాణాంతక (Fatal), ప్రాణాంతకం కాని (Non-Fatal) రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలు, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లా పరిధిలోని రెండు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను సంక్రాంతి పండుగకు ముందే వేగవంతంగా పూర్తి చేయాలని NHAI అధికారులు, కాంట్రాక్టర్లకు ఎస్పీ సూచించారు. పండుగ సమయంలో భారీ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, విద్యార్థులు, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

వీధి కుక్కల దాడుల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కుక్క కరిచిన వెంటనే ప్రాథమిక జాగ్రత్తలు తీసుకొని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రజల ప్రాణ రక్షణ, భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.

ఈ సమావేశంలో నార్కోటిక్స్ సూపరింటెండెంట్ తుక్యా నాయక్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ డీఎస్పీ సింగం నరేష్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఎస్ఐ అశోక్, NHAI అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news