యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గల
మున్సిపాలిటీలో ఈరోజు జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో 33వ వార్డు కౌన్సిలర్ నాకోటి నాగేష్ వార్డులోని ప్రజా సమస్యలను, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సభ దృష్టికి తీసుకువచ్చారు.
వార్డు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన:
పారిశుద్ధ్య నిర్వహణ మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల
వీధి కుక్కల మరియు కోతుల బెడద నివారణ చర్యలు
మంచినీటి సరఫరాలో ఇబ్బందుల పరిష్కారం
వీధి దీపాల మరమ్మతులు మరియు కొత్త లైట్ల ఏర్పాటు
తదితర మౌలిక సదుపాయాలపై ఆయన సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వార్డులో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తక్షణమే నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ ఆయన కోరారు.వార్డ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి