వెలిమినేడులో పథకంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్
చిట్యాల, నవంబర్ 28: పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న తెలంగాణ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ధీమాగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పథకానికి సంబంధించిన వివరాలను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా బీమా రూపంలో ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలని, పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి