Sthanikam - Truth Matters
Logo

నేరడ ఆలయంలో వైభవంగా లక్ష తులసీ దళార్చన.

Updated : 28 Nov 2026 18:37 IST
As Preferred Source 1 min read
నేరడ ఆలయంలో వైభవంగా లక్ష తులసీ దళార్చన.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

నేరడ గ్రామంలోని శ్రీ ఆండాళ్‌ శ్రీ ఆళ్వార్ల సహిత శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 11వ లక్ష తులసీ దళార్చన మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాపని జనార్దన్ మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు.

ఉదయం అర్చకులు శ్రీ కరుణ శంకర్ మిశ్రా స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు మరింగంటి లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్ష తులసీ దళాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు తులసీ దళాలను సమకూర్చి పూజల్లో పాల్గొన్నారు.

సాయంత్రం మహిళలతో సామూహిక లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. రాత్రి ఆకాశ దీపారాధన, ఆరగింపు, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలతో మహోత్సవం ముగిసింది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పిల్లలమర్రి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి కేబుల్ శ్రీనివాస్, కోశాధికారి ఆనందం కృష్ణయ్య, చెరుపల్లి గోవర్ధన్, ఆలయ సభ్యులు పిల్లలమర్రి దామోదర్, గుర్రం బిక్షం, మిర్యాల మల్లికార్జున, మిర్యాల వేణు, మిర్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేరడ ఆలయంలో వైభవంగా లక్ష తులసీ దళార్చన.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news