లింగోజిగూడెం పాఠశాల విద్యార్థులకు పండ్లు అందజేత
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ పర్నె శివారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం లింగోజిగూడెంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులకు పండ్లు అందజేశారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోసి హరిబాబు, ఎన్ఎస్‌యూఐ నాయకులు బండమీది శివ గణేష్, ఎర్ర వేణు, పిల్ల బద్రి, ఎర్రగోని మహేష్, ఎర్రగోని రాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి