Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

పోగొట్టుకున్న సర్టిఫికెట్ల బ్యాగ్ అప్పగింత. సీసీటీవీ ఆధారంగా గుర్తించిన రామన్నపేట పోలీసులు.

01-06-2026 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో ముఖ్యమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు ఉన్న బ్యాగును పోగొట్టుకున్న బాధితుడికి రామన్నపేట పోలీసులు సకాలంలో గుర్తించి అప్పగించారు. దీంతో బాధిత కుటుంబంలో ఆనందం నెలకొంది.

సిరబోయిన పోలరాజు తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై రామన్నపేట నుంచి ఉత్తటూరు వెళ్తుండగా మార్గమధ్యంలో సర్టిఫికెట్లు, ఇతర కీలక పత్రాలు ఉన్న బ్యాగును పొరపాటున పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా బ్యాగు ఆచూకీ లభించకపోవడంతో రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. కొన్ని గంటల్లోనే బ్యాగును గుర్తించి స్వాధీనం చేసుకుంది.

అనంతరం బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అతని సమక్షంలో బ్యాగును తనిఖీ చేశారు. అందులోని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం బాధితుడికి అప్పగించారు.

తమకు అత్యంత విలువైన పత్రాలను తిరిగి అందించినందుకు సిరబోయిన పోలరాజు, ఆయన కుటుంబ సభ్యులు రామన్నపేట పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పోగొట్టుకున్న సర్టిఫికెట్ల బ్యాగ్ అప్పగింత. సీసీటీవీ ఆధారంగా గుర్తించిన రామన్నపేట పోలీసులు.

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో ముఖ్యమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు ఉన్న బ్యాగును పోగొట్టుకున్న బాధితుడికి రామన్నపేట పోలీసులు సకాలంలో గుర్తించి అప్పగించారు. దీంతో బాధిత కుటుంబంలో ఆనందం నెలకొంది.

సిరబోయిన పోలరాజు తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై రామన్నపేట నుంచి ఉత్తటూరు వెళ్తుండగా మార్గమధ్యంలో సర్టిఫికెట్లు, ఇతర కీలక పత్రాలు ఉన్న బ్యాగును పొరపాటున పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా బ్యాగు ఆచూకీ లభించకపోవడంతో రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. కొన్ని గంటల్లోనే బ్యాగును గుర్తించి స్వాధీనం చేసుకుంది.

అనంతరం బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అతని సమక్షంలో బ్యాగును తనిఖీ చేశారు. అందులోని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం బాధితుడికి అప్పగించారు.

తమకు అత్యంత విలువైన పత్రాలను తిరిగి అందించినందుకు సిరబోయిన పోలరాజు, ఆయన కుటుంబ సభ్యులు రామన్నపేట పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News