Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

ఫెయిల్ అయిన బాధ తట్టుకోలేక యువతి దారుణం

ఫెయిల్ అయిన బాధ తట్టుకోలేక యువతి దారుణం

ఫెయిల్ అయిన బాధ తట్టుకోలేక యువతి దారుణం
13-04-2026 275 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన నిరాశతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం కారమంగి గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన విట్టల్ కుమార్తె అంబిక నందిని హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై, హైదరాబాదులోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటన విషయం గ్రామానికి తెలియడంతో కారమంగి గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది; కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమై విలపిస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యార్థులు పరాజయాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. సోమవారం సాయంత్రం కారమంగి గ్రామంలో అంబిక నందిని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు; ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Sthanikam

ఫెయిల్ అయిన బాధ తట్టుకోలేక యువతి దారుణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News