Sthanikam - Truth Matters
Logo

పెద్ద కాపర్తి స్కూల్ ప్రహరీకి వాహనం ఢీ తప్పిన పెను ప్రమాదం

Updated : 14 Mar 2026 21:01 IST
As Preferred Source 1 min read
 పెద్ద కాపర్తి  స్కూల్ ప్రహరీకి వాహనం ఢీ తప్పిన పెను ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఘటన స్థానికులను కలవరపరిచింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గోడ కుప్పకూలింది. రాత్రి సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళితే… అర్ధరాత్రి సమయంలో అతివేగంగా వచ్చిన భారీ వాహనం నియంత్రణ కోల్పోయి పాఠశాల ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ఢీకొట్టిన దెబ్బకు గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.70 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ తెలిపారు. ఘటన అనంతరం వాహనం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో ఏ వాహనం ఢీకొట్టిందో గుర్తించేందుకు పాఠశాల సిబ్బంది సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ఉన్న వాణిజ్య సముదాయాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించి బాధ్యత లేకుండా పరారైన వాహనదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్‌ఎం తెలిపారు.

ఇక ప్రహరీ గోడ ధ్వంసం కావడంతో విద్యార్థుల భద్రతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, స్కూల్ జోన్‌లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Sthanikam

పెద్ద కాపర్తి స్కూల్ ప్రహరీకి వాహనం ఢీ తప్పిన పెను ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి