నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28 నుండి నవంబర్ 6 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తుందని, కావున మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోనిపట్టాభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందేందుకై దరఖాస్తు చేసుకోవాలని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం లింగయ్య కోరారు.గురువారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023 వ సంవత్సరం వరకు పట్టాభద్రులుగా నమోదు కాబడిన వారు, మరియు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టాభద్రులు కూడా తిరిగి మరల ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు, ఎన్నికల కమిషన్ కు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం దరఖాస్తుదారులు తమ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు ధ్రువపత్రాలను స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు, లేదా తమ గ్రామంలోని బిఎల్ఓ లకు అందజేయాలని ఆయన తెలిపారు. 2023వ సంవత్సరం నాటికి పట్టాబద్రులుగా ఉన్నవారు మాత్రమే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు అని ఆయన తెలిపారు. కావున ఇట్టి అవకాశాన్ని మండలంలోని పట్టా బద్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, మండల నాయకులు ఎల్ పి రామయ్య, వేట శివాజీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తు చేసుకోవాలి

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి