బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్‌కుమార్
తిరుమలగిరి: రానున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం తిరుమలగిరి పట్టణంలో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై నాయకులతో చర్చించారు.
పట్టభద్రుల ఓటు నమోదుకు ప్రతి మండలంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రాలు అందజేస్తున్న పట్టభద్రులతోనే ఫారం-18ను పూర్తి చేయించాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు తీసుకురావాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి సూర్యాపేటకు బుల్లెట్ రైలు తీసుకొస్తే బీఆర్‌ఎస్ నాయకత్వంతో చర్చించి ఎన్నికల నుంచి తప్పుకునే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. బుల్లెట్ రైలు మార్గాన్ని సూర్యాపేట మీదుగా కాకుండా గుంటూరు వైపు మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కిశోర్‌కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విమర్శలు, మాటలకే పరిమితం కావద్దని సూచించారు. మేధావులు, యువత, సమాజంపై అవగాహన ఉన్న పట్టభద్రులు ఆలోచించి ఓటు వేస్తారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, గుజ్జ యుగంధర్‌రావు, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల ఎన్నికల ఇన్‌చార్జీలు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి