నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే, లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని, ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజూ పనిచేస్తున్న వారి సేవలు అభినందనీయమని అన్నారు. సమాజ సేవలో భాగంగా కార్మికులకు దుస్తులు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నా
రు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి