కోదాడ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని,ప్రతి ఇంటా సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని,సానుకూల ఆలోచనలను నింపాలని పేర్కొన్నారు. ప్రజల మధ్య ప్రేమానురాగాలు,ఐక్యత, సోదరభావం మరింత పెరగాలని, రైతులు, కార్మికులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా,ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
ప్రతి ఇంటా దీపావళి వెలుగులు నిండాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి