కోదాడ పట్టణ ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ శివశంకర్ సూచించారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ..బాణసంచా కాల్చే సమయంలో పెద్దలు, పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా కాల్చకుండా జాగ్రత్త వహించాలని,నీళ్లు,ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.బాణసంచా విక్రయించే వ్యాపారులు కూడా నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని తెలిపారు.ఈ సందర్భంగా కోదాడ పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళి వేడుకల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఐ శివశంకర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి