Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో కోదాడ మార్కెట్ అభివృద్ధి

Updated : 08 Nov 2026 10:04 IST
As Preferred Source 1 min read
మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో కోదాడ మార్కెట్ అభివృద్ధి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సలహాలు, సూచనలు, సహకారంతో కోదాడ వ్యవసాయ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ తెలిపారు. శుక్రవారం మునగాల మండలం బరాకత్‌గూడెంలోని మార్కెట్ చెక్‌పోస్టును ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు చేసి లారీల ద్వారా తరలించే వాహనదారులు చిమిర్యాల, బాలాజీనగర్, బరాకత్‌గూడెం చెక్‌పోస్టుల వద్ద మార్కెట్ ఫీజు చెల్లించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.కోదాడ మార్కెట్‌లో శని, ఆదివారాల్లో నిర్వహించే గొర్రెలు, పశువుల సంతకు వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పరిశుభ్రత వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో సంతలో ఉన్న దళారుల వ్యవస్థను తొలగించి కొనుగోలుదారులు, అమ్మకందారులు నేరుగా వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో కోదాడ మార్కెట్ అభివృద్ధి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి