Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

కాలుష్యానికి దూరంగా ఉండాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజలకు డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి

Updated : 08 Nov 2026 06:51 IST
As Preferred Source 1 min read
కాలుష్యానికి దూరంగా ఉండాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.  ప్రజలకు డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి

ఆరోగ్యమే అసలైన వెలుగు.. జాగ్రత్తలతో దీపావళి!

హైదరాబాద్, నవంబర్ 8 (స్థానికం): దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి వేళ బాణసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ, రసాయనాలు గాలి నాణ్యతను దెబ్బతీసి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు కాలుష్య ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎన్‌-95 మాస్క్ ధరించాలని పేర్కొన్నారు.

పండుగ వేళ మిఠాయిలు, స్వీట్లు అధికంగా తీసుకోకుండా నియంత్రణ పాటించాలని, ముఖ్యంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలున్న వారు ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాణసంచా వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఆనందాల దీపావళి.. ఆరోగ్యకరమైన దీపావళి కావాలి! పర్యావరణాన్ని కాపాడుకుంటూ, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ పండుగ జరుపుకోవడమే నిజమైన వేడుక అని డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి