Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 09:05 PM

ప్రశాంత వాతావరణంలో నేడు గణేశ్ నిమజ్జనం...

22-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

1,000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర నిఘా...

డీజేలకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి లేదు...

నల్గొండ : జిల్లాలో గణేశ్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రత, ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ‘జీరో యాక్సిడెంట్ - జీరో ఇన్సిడెంట్’ లక్ష్యంగా వినాయక నిమజ్జనానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీలు, భక్తులు పాటించాల్సిన నిబంధనలు, భద్రతా వివరాలను ఎస్పీ వెల్లడించారు.

ఎత్తును బట్టి నిమజ్జన మార్గాలు...

జియో ట్యాగింగ్ చేసిన 6,184 విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలను కేటాయించారు.10 అడుగుల లోపు విగ్రహాలు.. బతుకమ్మ కుంట లేదా వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలి.​10 అడుగుల కంటే ఎక్కువ ఉన్నవి క్లాక్ టవర్ – రామగిరి, పానగల్ ఫ్లైఓవర్, తిప్పర్తి, వేములపల్లి మార్గం గుండా వేములపల్లి కెనాల్ వద్ద నిమజ్జనం చేయాలి.. సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఉన్నందున, 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను 14వ మైలురాయి హాలియా వైపు అనుమతించారు.

1,000 మందితో భారీ భద్రత...

ఎస్పీ పర్యవేక్షణలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 850 మందికి పైగా ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, బాంబ్, డాగ్ స్క్వాడ్లతో కలిపి మొత్తం 1,000 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన రహదారులు, పట్టణాల్లో 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. చెరువులు, కెనాల్స్ వద్ద గజ ఈతగాళ్లు, క్రేన్లు, ఫ్లడ్ లైట్లను అందుబాటులో ఉంచారు.

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు...

​శోభాయాత్ర సాగే పూల్ చౌరస్తా, 1-టౌన్, క్లాక్ టవర్, పుల్లారెడ్డి సెంటర్, రామాలయం గుండా వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు. భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు...​హాలియా, దేవరకొండ - హైదరాబాద్: జేఎమ్ గౌడ్ ఎక్స్ రోడ్, ఈద్గా, మునుగోడు బైపాస్, ఐటీ టవర్ మీదుగా వెళ్లాలి. మిర్యాలగూడ - హైదరాబాద్, తిప్పర్తి, నకిరేకల్, నార్కట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి. దేవరకొండ - మిర్యాలగూడ: డి.ఈ.ఓ ఆఫీస్ వైపు నుంచి వాహనాలు మళ్లించబడతాయి.

ప్రజలు, నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు...​డీజేలు, అధిక శబ్దాల సౌండ్ సిస్టమ్స్, బాణాసంచా కాల్చడంపై పూర్తి నిషేధం. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు; డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. విగ్రహాల వాహనాలను ముందే తనిఖీ చేయించుకోవాలి. ​నిమజ్జన ప్రాంతాల్లో చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవ్ టీజింగ్, అసభ్య ప్రవర్తనపై నిఘా ఉంచేందుకు షీ టీమ్స్ పనిచేస్తాయి.

​శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. వినాయక ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ప్రశాంత వాతావరణంలో నేడు గణేశ్ నిమజ్జనం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News