Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

ప్రపంచ రికార్డులతో మెరిసిన లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ

12-04-2026 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్

మార్షల్ ఆర్ట్స్ రంగంలో లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ మరో ఘనత సాధించింది. అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ వార్షిక బ్లాక్ బెల్ట్ అవార్డు ప్రదానోత్సవం, గిన్నిస్ & లిమ్కా రికార్డ్స్ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులందరూ అదే అకాడమీలో శిక్షణ పొందుతున్నవారే కావడం ప్రత్యేకత. వారి కరాటే ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ముఖ్యంగా తల్హా, అయాన్ అలీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రశంసలు అందుకున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం తీసుకువచ్చారు. స్టంట్ మాస్టర్స్ బద్రి (డేర్ డెవిల్), కృష్ణ, మూవీ ఎడిటర్ సంపత్ అన్నా, ప్రకాశ్ అన్నా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ కే. మహేష్ నాయక్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.

అకాడమీ Founder & President (India Style Chief) నేతృత్వంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.

చైర్మన్ డా. లయన్ గోపాల్ రెడ్డి, సీనియర్ మాస్టర్ పీఎం రాము, అలాగే మాస్టర్స్ సిహెచ్ రాజ్ కుమార్, ఎస్ ప్రసాద్ వెంకటేష్, ఆర్ మహేష్, నందిని, శ్రీకాంత్, శివల కృషి కార్యక్రమ విజయానికి కీలకంగా నిలిచింది.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు కరాటే ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ప్రపంచ రికార్డుల సాక్షిగా నిర్వహించిన ఈ వేడుక అకాడమీకి మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది.

Sthanikam

ప్రపంచ రికార్డులతో మెరిసిన లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News