అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజాప్రభుత్వం పంపిణీ అందజేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. మంగళవారం
మునగాల మండలం బరాఖత్ గూడెం లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో మునగాల మండల పరిధిలోని 14805 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని భవిష్యత్లో ప్రతి సంక్షేమ పథకం ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా పారదర్శకంగా అందుతాయని ఆమె అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి