Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదు.. డీఎస్పీ హెచ్చరిక

Updated : 18 Nov 2026 19:02 IST
As Preferred Source 1 min read
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదు.. డీఎస్పీ హెచ్చరిక

ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దాలు వచ్చే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకుని రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై సంగారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తున్న సుమారు 200 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ఆయా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న సుమారు 200 సైలెన్సర్లను రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ సత్యయ్య గౌడ్ మాట్లాడుతూ.. వాహనాలకు అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చుకుని రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల శబ్ద కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు. మోడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించే వాహనాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, రోడ్లపై క్రమశిక్షణను పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, రూరల్ సీఐ నయీముద్దీన్, టౌన్ సీఐ రాము నాయుడు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదు.. డీఎస్పీ హెచ్చరిక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి