Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

బాలికల భవిష్యత్తుకు బంగారు బాట.. ఉచిత కంప్యూటర్ శిక్షణ

Updated : 18 Nov 2026 18:25 IST
As Preferred Source 1 min read
బాలికల భవిష్యత్తుకు బంగారు బాట.. ఉచిత కంప్యూటర్ శిక్షణ

సంగారెడ్డి జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో – బేటీ పడావో పథకంలో భాగంగా మహిళలు, బాలికలకు ఉచిత కంప్యూటర్, టాలీ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి కె. లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని, మహిళలు, బాలికలు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేందుకు మంచి అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం సంగారెడ్డి తహసీల్దార్ జయరాం మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మహిళలు, బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఐశ్వర్య, విశాల, శిక్షకురాలు మౌనిక, మహిళలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికల భవిష్యత్తుకు బంగారు బాట.. ఉచిత కంప్యూటర్ శిక్షణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి