మహాకవి కాళోజి నారాయణరావు రచనలు, ఆశయాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళోజి 24వ వర్ధంతి సందర్భంగా కోదాడలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాళోజి తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని, మఅన్యాయాలు, అక్రమాలపై నిర్భయంగా గళమెత్తిన ప్రజాకవిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవం,ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం, నాయకులు సోంపేట ఉపేందర్ గౌడ్, మాదాల ఉపేందర్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకవి కాళోజి సేవలు చిరస్మరణీయం: బొల్లం మల్లయ్య యాదవ్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి