ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) సూర్యాపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కోదాడ బస్టాండ్ సెంటర్‌లోని గాంధీ విగ్రహం ఎదుట TPTLF ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జె. నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు మృతి చెందారని తెలిపారు. ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు, ఇతర కారణాలతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఉపేంద్ర కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TPTLF నాయకులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి