Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 09:28 PM

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి. అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి.

29-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి సెప్టెంబర్ 29

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో సుమారు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం సుమారు 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు, లారీలు, హమాలీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించాలని, రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు తదితర కనీస వసతులు కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించనున్నట్లు తెలిపారు. ఏ–గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు వెంకారెడ్డి పేర్కొన్నారు

Sthanikam

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి. అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News