రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పైళ్ల ప్రతాపరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఇస్కిల్లకు వెళ్లారు. ప్రతాపరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బందెల రాములు, పోషబోయిన మల్లేశం, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, గొలుసుల సత్తయ్య, మాజీ ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, పున్న వెంకటేశం, బందెల యాదయ్య, కోళ్ల స్వామి, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, ఎస్కే చాందు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి