Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంటైనర్ వాహనం ఢీకొని అదనపు కలెక్టర్‌ వాహనం ధ్వంసం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 09:14 AM

ఒకే వేదికపై.. నాలుగు తరాల ఆత్మీయ బంధం!

ఒకే వేదికపై.. నాలుగు తరాల ఆత్మీయ బంధం!

ఒకే వేదికపై.. నాలుగు తరాల ఆత్మీయ బంధం!
28-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​అలరించిన సుర్వి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

ఒకేచోట చేరిన 200 మంది బంధువులు

తరాలు మారినా అనుబంధాలు మారవని చాటిచెబుతూ సుర్వి కుటుంబ సభ్యులు ఒకే వేదికపైకి చేరి సందడి చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ళ సింగారం గ్రామానికి చెందిన కీర్తిశేషులు సుర్వి రాజమ్మ-సాయన్న గౌడ్ దంపతుల కుమారులు, కుమార్తెలు, వారి బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మల్కాపురం గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.​ఈ వేడుకలో నాలుగు తరాలకు చెందిన సుమారు 200 మంది సుర్వి కుటుంబ సభ్యులు ఒక్కటై ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. పెద్దల ఆశీస్సులు, పిల్లల ఆటపాటలు, పిచ్చాపాటీ ముచ్చట్లతో రోజంతా ఆనందోత్సవాల మధ్య గడిపారు.​ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ... నాలుగు తరాల కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు కుటుంబాల మధ్య అనురాగాన్ని, ఆప్యాయతలను మరింత పెంపొందిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

ఒకే వేదికపై.. నాలుగు తరాల ఆత్మీయ బంధం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News