చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం నేపథ్యంలో, నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు మల్కాపురం వద్ద 5 ఎకరాల అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో ప్రస్తుత యార్డ్ స్థలం మారుతున్నందున, రైతులు తాము పండించిన పంటలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకునేందుకు వీలుగా మల్కాపురం వద్ద 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్ యార్డ్‌కు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు పాలకవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెలిమినేడు రఘుమారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, డిల్లి చంద్రకళ, మహమ్మద్ గౌస్ ఖాన్, చిమ్మల వెంకట్ రెడ్డి, కొమ్ము లక్ష్మయ్య, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మర్రి రాజి రెడ్డి, సుర్వి వెంకటేష్ గౌడ్, కాటేపల్లి నవీన్ గౌడ్, దాచేపల్లి విజయ్ కుమార్, గజ్జెల కృష్ణ మూర్తి, మార్కెట్ కమిటీ కార్యదర్శి వి.రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి