Sthanikam - Truth Matters
Logo

రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు సహించేది లేదు

Updated : 20 Nov 2026 17:05 IST
As Preferred Source 1 min read
రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు సహించేది లేదు

డీసీసీ అధ్యక్షుడు కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి : దైద రవీందర్.

నకిరేకల్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. నేతి విద్యాసాగర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కైలాష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకులని, వారి రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను తక్కువ చేసి మాట్లాడటం తగదన్నారు. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడే ముందు కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పదవుల కోసం వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని విమర్శించారు.ఈ సమావేశంలో సుంకరబోయిన నర్సింహా, కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఛత్రపతి, సర్పంచులు వల్లపు శ్రీనివాస్‌రెడ్డి, నాగంపల్లి శ్యామ్, సైదులు, ముక్కామల శేఖర్, కోట పుల్లయ్య, మాద లింగస్వామిగౌడ్, చెరుకు యాదగిరి, రంగు వీరయ్య, వెంకటేష్, శ్రీను, బోస్, చెరుకు సైదులు, చెరుకు యాదయ్య, నాగరాజు, నవీన్, యాకోబు, చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు సహించేది లేదు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి