చౌటుప్పల్‌లో పథకాన్ని ప్రారంభించిన ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని 9వ వార్డు శివాజీనగర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం లబ్ధి చేకూర్చేందుకు కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జీలు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తామన్నారు. ప్రతి కౌన్సిలర్ తమ వార్డుల్లోని అర్హులందరికీ బీమా నమోదు చేయించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీమా నమోదు కోసం రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో సంబంధిత వార్డు ఇన్‌ఛార్జిని సంప్రదించాలని, దరఖాస్తు అనంతరం వచ్చే ఐడీ నంబరును జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, షేక్ నవీబీ, జానీ బాబా, నాయకులు దేప రమ్య రాజు, సురుకంటి బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజినీర్ రేణుకుమార్, వార్డు అధికారి రామ్ నారాయణమూర్తి, జవాన్ అంజయ్య, శివాజీనగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి