సంగారెడ్డి పట్టణ శివారులోని గేట్‌వే మ్యానర్స్ వద్ద నూతనంగా నిర్మించిన నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింత పెంపొందాలని అన్నారు. అనంతరం పాత కంది గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి