14వ వార్డులో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' ప్రారంభం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, ధీమా కల్పించేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రవేశపెట్టిందని చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 14వ వార్డులో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కో-ఆప్షన్ సభ్యులు సందగళ్ళ విజయ సతీష్ గౌడ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ. పేదల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. పేద కుటుంబాల్లో ఇంటి పెద్ద మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5 లక్షల బీమా ప్రయోజనం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ డైరెక్టర్ వర్కాల రవి, వార్డు ఇన్‌ఛార్జ్ బొంగు వెంకటేష్, ఊదరి స్వామినాధం, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు కామిశెట్టి చంద్రశేఖర్, వరగంటి శ్రీను, వరగంటి భాను, ఎస్.కె. మున్నా, చెరుకు రాజు, జిట్టగోని శ్రీను, తడకమళ్ళ శ్రీనివాస్ గుప్తా, చెన్నగోని శివ గౌడ్, అప్పిడి శేఖర్ రెడ్డి, ఊడుగు నవీన్ కుమార్, జోర్రీగల ఆంజనేయులు, కొయ్యల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి