Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి

Updated : 19 Nov 2026 19:40 IST
As Preferred Source 1 min read
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలి

నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలి

డీఆర్ఓకు వినతిపత్రం అందజేసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 19: స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం, పరిశుభ్రమైన తాగునీరు, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు గురువారం బీఎస్పీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు పేద, బహుజన విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అయితే కొన్ని వసతి గృహాల్లో భోజన నాణ్యత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు.

జిల్లాలోని అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మోడల్ స్కూళ్లలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వినతిపత్రంలో కోరారు. పురుగులు ఉన్న అన్నం, కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డించకుండా పర్యవేక్షించాలన్నారు. వంటశాలలు, ఆహార నిల్వ గదులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాలని, పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లు, విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వార్డెన్లు, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి వసతి గృహంలో విద్యార్థులతో ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి భోజన నాణ్యతను పర్యవేక్షించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, తనిఖీల్లో గుర్తించిన లోపాలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని దొడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి పల్లాటి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు అనంత రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార మల్లేష్, జిల్లా మహిళా కన్వీనర్ కంబాలపల్లి శాంత, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిత్రం కృష్ణ, సోషల్ మీడియా ఇన్‌చార్జి యంజాల ప్రహ్లాద్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఇన్‌చార్జి వంగల కృష్ణ ప్రసాద్, బంగారుగళ్ల మహేందర్, షాద్‌నగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి తుప్పరి కుమార్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి పి. చిన్నారావు, గుండె శ్రీనివాస్, మసూర్ నాగరాజ్, శివగల ఆంజనేయులు, టప్ప కృష్ణ, నీరటి రాజు, కొండేటి మహేందర్, నల్ల పరమేష్, పట్నం రమేష్ కురుమ, లపంగి రాజు, కొండు రఘుపతి, ఎర్ర సురేష్, గట్టు నరసింహ, గోరేటి కుమార్, పి. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి