చిట్యాల: వేలిమినేడు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన యూనియన్ సభ్యులు ఏరుకొండ ఆంజనేయులు కుమార్తె అకాల మరణం పట్ల యూనియన్ నాయకులు, సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి యూనియన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బుట్టి పురుషోత్తం, సెక్రటరీ బద్దం మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు అంతటి నరేష్ గౌడ్, కాటన్ సత్తయ్య, ఆరూరి జానయ్య, ఆరూరి శీను తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సంతాపాన్ని ప్రకటించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి