Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

నిదానపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 310 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నారపాక రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాకు గౌరవ వందనం సమర్పిస్తూ, పార్టీ స్థాపన వెనుక ఉన్న లక్ష్యాలు, ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్రను నాయకులు గుర్తుచేశారు.అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వ కృషిని వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోతకోని శాంతి కుమార్, వర్కాల మల్లేష్, కడారి మహేష్, వర్కాల సూరత్, సల్ల ఉపేందర్, భాష మల్ల క్రాంతి, నారపాక అజయ్, వర్కాల గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నిదానపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News