Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హక్కుల కోసం జర్నలిస్టుల గళం.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 07:24 PM

నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ!

02-10-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జిల్లాలో మరో 250 పంచాయతీల్లోనూ ఇవే అక్రమాలంటూ సంచలన వ్యాఖ్యలు

బెల్ట్ షాపుల రద్దుకు గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం

గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మల్కాపురం గ్రామంలో నిర్వహించిన 'విజిపిపి' గ్రామసభ రసాభాసగా మారింది. గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవిపై గ్రామస్తులు చేసిన అవినీతి ఆరోపణల నివేదికపై డిఎల్‌‌పిఓ ఇచ్చిన రిపోర్టును సభలో ప్రస్తావించారు. దీనిపై కార్యదర్శి రమాదేవి స్పందిస్తూ, తాను పంచాయతీ రాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 32 పర్యాయాలు చెల్లింపులు చేసిన మాట వాస్తవమేనని నిండు గ్రామసభలో బహిరంగంగా ఒప్పుకోవడం కలకలం రేపింది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 గ్రామపంచాయతీల్లోనూ కార్యదర్శులు చట్టానికి విరుద్ధంగా నిధులు డ్రా చేశారని ఆమె పేర్కొనడం సభలో ఉన్నవారందరినీ విస్తుపోయేలా చేసింది. ​గ్రామస్తులు అడిగిన సమస్యలు, అక్రమాలపై ఆమె సరైన వివరణ ఇవ్వకపోగా, తాను చేసిన విధానమే సరైనదంటూ ప్రజలతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు 2018 పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 6(3)సి ప్రోటోకాల్ నియమాలను తుంగలో తొక్కి, గ్రామసభ వేదికపైకి పిఎసిఎస్ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సర్పంచ్ గీర్కాటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే ఎత్తివేయాలని గ్రామస్తులు కోరగా, గ్రామసభలో బెల్ట్ షాపుల మూసివేతకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానాన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులు వ్యతిరేకించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

Sthanikam

నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News