*31,116/-లకు లడ్డు వేలం - కన్నుల పండుగగా నిమజ్జన శోభాయాత్ర*
చిట్యాల మండలం నేరడ గ్రామం శ్రీశ్రీ మహమ్మాయి శాంభవి దేవి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ఆలయ ప్రధానార్చకులు పెందోట సత్యనారాయణ,సహ అర్చకులు శివ కిరణ్ అర్చకత్వంలో నిర్వహించడం జరిగింది.తొమ్మిది రోజులు ఆ గణనాథుడు అత్యంత వైభవోపేతంగా పూజలు అందుకొని బుధవారం గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది.అనంతరము వేలంపాటలో తట్టుకునూరు శివప్రసాద్ రు. 31,116/- లడ్డును దక్కించుకున్నారు.అనంతరము దేవాలయ చైర్మన్ పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామస్తులందరి సహకారంతో తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా విజయవంతమయ్యాయి,ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,లడ్డును దక్కించుకున్న శివప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు.రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోలోజు ఈశ్వర చారి,పెందోట శంకరాచారి,చెన్నోజు పాండు,చెన్నోజు విష్ణుమూర్తి,సంకోజు నరసింహ చారి, కొమ్ముజు శ్రీనివాసాచారి,కటకం రమేష్, బొల్లోజు రఘు,రవిశంకర్,శ్రీనివాస్ చారి,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి