విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్
గ్రామీణ ప్రాంత యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ వసంత నాగేష్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో దబ్బటి రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం యువకుల కోసం 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పరుగు పందాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. యువత సన్మార్గంలో పయనిస్తూ, ప్రతిరోజు ఉదయం పూట ఐదు కిలోమీటర్లు నడవడం లేదా పరుగెత్తడం లాంటి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. అనంతరం పోటీలో ఉత్సాహంగా పాల్గొని గెలుపొందిన యువకులకు, ప్రతిభ చూపిన వారందరికీ మెడల్స్ ప్రధానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిన్నం బాలరాజ్, కార్యక్రమ నిర్వాహకులు దబ్బటి రాములు గౌడ్, గ్రామ ప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి