తన హావ భావాలతో, నటనతో అందరిమోములపై నవ్వులు పూయించిన వేణుమాధవ్ నవ్వులకే రారాజు అని "తెర" సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు అన్నారు.
తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో కోదాడలో సహజనటుడు, హాస్యపు జల్లు, కామెడీ కింగ్ వేణుమాధవ్ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేణుమాధవ్ చిత్రపటానికి తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు పార సీతయ్యలు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తదనంతరం వేముల వెంకటేశ్వర్లు, పార సీతయ్యలు మాట్లాడుతూ చిన్ననాటి నుండే తన చేష్టలతో, హావభావాలతో, అనుకరణతో, మాట్లాడే బొమ్మతో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరిని నవ్వించిన వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేసి 400కు పైగా సినిమాలలో తనదైన శైలిలో రాణించారని అన్నారు. తన నవ్వుల పరిమళాన్ని తెలుగు ప్రేక్షకులకు వెదజల్లుతూ అనేక సంఘాల నుండి ప్రభుత్వం నుండి ప్రత్యేక అవార్డులను సొంతం చేసుకోవడమే తన నటనకు నిదర్శమని వారన్నారు. నటుడిగా, మిమిక్రీ కళాకారునిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, అన్నిట్లో తనదైన ముద్ర వేసి విజయం సాధించారని, సంగీత వాయిద్యాలను వివిధ కోణాలలో పలికించడంలో తనది అందివేసిన చేయని, కోదాడలోని కె. ఆర్. ఆర్. కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘాలలో చురుకైన పాత్ర పోషించి అందరివాడు అనిపించుకున్నాడు వేణుమాధవ్. గొప్ప మానవీయకోణం ఉన్న వేణుమాధవ్ వరద బాధితుల సహాయనిధి సేకరణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో, వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టి సేవ చేశారని వారు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెర సాంస్కృతిక కళామండలి సాంస్కృతిక కార్యదర్శి షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, బూర సైదారావు, షేక్ పీర్ సాహెబ్, గుండెల సూర్యనారాయణ, చింతలపాటి శేఖర్, రామిశెట్టి హరి ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి