Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ! నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 06:05 PM

నారాయణఖేడ్‌లో ఘనంగా ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం

02-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని బాలాజీ అనురాధ ఆసుపత్రిలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి జయంతి సందర్భంగా బాలాజీ అనురాధ ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు, చూపిన ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్య సలహాలు అందించడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు రక్తదానం ఎంతో అవసరమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ అనురాధ ఆసుపత్రి యాజమాన్యం, లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.కార్యక్రమంలో పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, వైద్యులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ పట్లోళ్ల అనురాగ్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో ఘనంగా ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News